Home   »  ఆంధ్రప్రదేశ్   »   విశాఖలోని బైజూస్‌ విద్యాసంస్థలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖలోని బైజూస్‌ విద్యాసంస్థలో భారీ అగ్ని ప్రమాదం

schedule ranjith

byjus institution | విశాఖ గాజువాకలోని ఆకాశ్‌ బైజూస్‌ విద్యాసంస్థలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

byjus institution | A huge fire broke out at Byjus Educational Institution in Visakha

విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండో అంతస్థులో ఉన్న ఆకాష్ బైజుస్ విద్యాసంస్థ (byjus institution)లో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ACలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ వెనుక భాగంలో నివాస ప్రాంతాలు ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేసారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read | సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం