Home   »  ఆంధ్రప్రదేశ్   »   లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసేందుకు కర్నూలు చేరుకున్న వైఎస్ జగన్..!

లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసేందుకు కర్నూలు చేరుకున్న వైఎస్ జగన్..!

schedule raju

Law University | APకి న్యాయ రాజధానిగా అవతరించబోతున్న కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. కర్నూలులో నేడు కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి CM జగన్ శంకుస్థాపన చేస్తారు.

AP CM who laid foundation stone of Law University

కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టులో 150 ఎకరాల స్థలంలో నూతన నేషనల్ లా యూనివర్సిటీ (Law University) నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలుకు చేరుకున్నారు. రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,011 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Law Universityకి భూమి పూజ చేసిన జగన్

ఓర్వకల్‌ విమానాశ్రయానికి (కర్నూలు విమానాశ్రయం) చేరుకున్న CM జగన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో జగన్నాథగట్టుకు చేరుకుని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన న్యాయ విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండవ విశ్వవిద్యాలయంగా దీనిని నిర్మించనున్నారు.

దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ. ఇప్పుడు దేశంలో 29వ లా యూనివర్సిటీ కర్నూలులో ఏర్పాటు కాబోతోంది. కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించిన YSRCP ప్రభుత్వం లా యూనివర్సిటీ నిర్మాణాలు మొదలు పెడుతుండటంతో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్టయింది.

YSR EBC నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న జగన్

శంకుస్థాపనకు ముందు YSR EBC నేస్తం కార్యక్రమంలో భాగంగా CM వైఎస్ జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను పంపిణీ చేశారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, ఆయా ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ జిల్లాల పర్యటన సాగుతోంది. నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం రాష్ట్ర విద్యారంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతుంది. ఔత్సాహిక న్యాయ నిపుణులకు నాణ్యమైన విద్య మరియు శిక్షణ పొందేందుకు అవకాశాలను అందిస్తుందని YCP ప్రభుత్వం తెలిపింది.

Also Read: మార్చి 17న బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ..