Home   »  ఆంధ్రప్రదేశ్   »   పుంగనూరు దాడి కేసులో తీర్పు రిజర్వ్

పుంగనూరు దాడి కేసులో తీర్పు రిజర్వ్

schedule mounika

AP: చిత్తూరు జిల్లా పుంగనూరు దాడి కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. TDP నేత చల్లా రామచంద్రారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టులో విచారణ జరిగింది. ఘటనాస్థలిలో చల్లా లేరని, రాజకీయ దురుద్దేశంతోనే అక్రమకేసులు పెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

చల్లా ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.