Home   »  ఆంధ్రప్రదేశ్   »   TDPకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..!

TDPకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..!

schedule mahesh

Kishore Chandradev | కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ TDPని వీడారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. NDAలో TDP చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

kishore-chandradev-resigned-from-tdp

Kishore Chandradev | కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ TDPని వీడారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. NDAలో TDP చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్వేషశక్తులతో TDP చేతులు కలపడం సహించరాని విషయమని, అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు.

UPA హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన Kishore Chandradev

2019లో కాంగ్రెస్‌ను వీడి TDPలో చేరిన కిషోర్ చంద్రదేవ్ అదే ఏడాది అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆరుసార్లు MPగా ఎన్నికైన కిషోర్ చంద్రదేవ్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వ హయాంలో కేంద్ర గిరిజన వ్యవహారాల, పంచాయితీ రాజ్ మంత్రిగా పనిచేశారు. రాజీనామా తర్వాత ఆయన మరేదైనా రాజకీయ పార్టీలో చేరతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తారా అనే దానిపై స్పష్టత లేదు.

Also Read | హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన AP మంత్రి..!