Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఆంధ్ర ను తాకిన అల్పపీడనం….

ఆంధ్ర ను తాకిన అల్పపీడనం….

schedule sirisha

ఆంధ్రప్రదేశ్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్ర లోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణం శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణం శాఖ తెలిపింది.

మరో వైపు ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు శుక్రవారం నుంచి ఈ నెల 21వరకు వరకు ఆంధ్ర తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.