Home   »  ఆంధ్రప్రదేశ్   »   Margadarsi Case: మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు ఫిర్యాదు

Margadarsi Case: మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు ఫిర్యాదు

schedule raju

Margadarsi Case: మార్గదర్శి (Margadarsi) లో ఫైనాన్షియల్‌ స్కాం జరిగిందని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ స్పష్టం చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో  చిట్లు వేసి నష్టపోయానని అన్నపూర్ణదేవి అనే  మహిళ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నపూర్ణాదేవితో  పాటు సీఐడీ అధికారులు అమరావతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు. 

గురువారం ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీపీ ఎన్‌ సంజయ్‌ (N Sanjay) మీడియాతో మాట్లాడుతూ….. సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు. మార్గదర్శి (Margadarsi) పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు.

Income Tax పేరిట నయా మోసం.. తస్మాత్‌ జాగ్రత్త!

కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి (Margadarsi) నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్‌ నిబంధనలను మార్గదర్శి (Margadarsi) పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి (Margadarsi) మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ (N Sanjay) తెలిపారు. కోటికి పైగా చిట్స్‌ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు.

చిట్స్ కడుతున్నట్లు 3 వేల మందికి తెలియదు.

మార్గదర్శిలో జరిగిన బిజినెస్‌లోనే అక్రమాలు జరుగుతున్నాయి. కోటికి పైగా చిట్‌లో పాల్గొన్న వాళ్లు 800 మందికి పైగా ఉన్నారు. మార్గదర్శిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్శి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగింది.

అన్ని రూల్స్‌ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారని ఏడీజీ సంజయ్ ఆరోపించారు.  ఆక్షన్‌ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారని..   40 శాతం చిట్‌ గ్రూపుల్లో చందాదారులే లేరని ఆరోపించారు.  కంపెనీనే సొంతంగా చిట్స్‌ను తీసుకుంటుందన్నారు.  చెక్‌ ప్రిపేర్‌ అయినా లెడ్జర్‌లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్‌ అమౌంట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు.

గోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుందని తెలిపారు.  కొందరు చిట్‌ వేయకున్నా వారి పేరుతో చిట్స్‌ నడుస్తున్నాయని సంజయ్ తెలిపారు.