Home   »  ఆంధ్రప్రదేశ్   »   త్వరలో అన్ని శాఖలకు శాశ్వత భవనాలు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

త్వరలో అన్ని శాఖలకు శాశ్వత భవనాలు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

schedule mounika

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలనను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో అన్ని శాఖలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు A.P వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. 6 కోట్లతో నిర్మించిన నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) నూతన భవనాన్ని నెల్లూరు M.P ఆదాల ప్రభాకర్ రెడ్డి, NUDA చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌తో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు.

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన Minister Kakani Govardhan Reddy

6 కోట్లతో నిర్మించిన నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) నూతన భవనాన్ని నెల్లూరు M.P ఆదాల ప్రభాకర్ రెడ్డి, చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌తో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు.

ఎనిమిది నియోజకవర్గాల్లో “NUDA” సేవలందిస్తున్నందున, అన్ని మౌలిక వసతులతో కూడిన శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజాప్రతినిధుల దృష్ట్యా శాశ్వత భవనాన్ని నిర్మించడంలో చైర్మన్‌ చొరవ చూపడం అభినందనీయమన్నారు.

NUDAకు శాశ్వత భవనం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన M.P ఆదాల ప్రభాకర్‌రెడ్డి..

నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి శాశ్వత భవనం రావడం పట్ల ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి Y.S జగన్‌మోహన్‌రెడ్డి స్పూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, శాశ్వత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, మేయర్ P. స్రవంతి జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: YSRCP లో చేరిన అంబటి రాయుడు