Home   »  ఆంధ్రప్రదేశ్   »   అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రోజా

అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రోజా

schedule mounika

ఆంధ్రప్రదేశ్: TDP అధినేత చంద్రబాబుపై AP మంత్రి రోజా (Minister Roja) మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్: TDP అధినేత చంద్రబాబుపై AP మంత్రి రోజా (Minister Roja) మరోసారి విరుచుకుపడ్డారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని మంత్రి రోజా ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదు: Minister Roja

అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. SCలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు.

అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని CM జగన్ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. CM జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.

ALSO READ: YSRCP అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల నాలుగో జాబితా విడుదల..