Home   »  ఆంధ్రప్రదేశ్   »   ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది: మంత్రి శ్రీనివాస

ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది: మంత్రి శ్రీనివాస

schedule mounika

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో రూ.1.64 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో  రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (Minister Chelluboyina Venugopala Krishna) పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి గ్రామంలో సంక్షేమ, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం: Minister శ్రీనివాస

ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి గ్రామంలో సంక్షేమ, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

జల్ జీవన్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మిస్తాం: మంత్రి శ్రీనివాస

వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతిక పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జల్ జీవన్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మిస్తామన్నారు. అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు.

రాజవోలు గ్రామంలో రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మించారు. గ్రామంలోని ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.61.80 లక్షలతో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులైన్ నిర్మించనున్నారు.

SE పాండురంగారావు, DE శేషగిరిరావు, MPDO శ్రీనివాసరావు, AE సంపత్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ DE శ్రీనివాసరావు, మాజీ MPP నక్కా రాజబాబు, మాజీ MPTC నక్కా శ్యాంబాబు, సొసైటీ చైర్మన్‌ గిరిజాల రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: NTRకు భారతరత్న ఇవ్వాలని కేశినేని చిన్ని పోస్ట్‌కార్డ్ ఉద్యమం..!