Home   »  ఆంధ్రప్రదేశ్   »   తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

schedule ranjith

Tirumala Alipiri | తిరుమల అలిపిరి మెట్ల మార్గం దగ్గర చిరుత పులి సంచారాన్ని మరోసారి టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని పట్టుకోవడానికి ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.

Tirumala Alipiri | Tirumala's Alipiri walkway is once again a cheetah

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది భక్తులు కొండపైకి నడక మార్గంలో దైవ దర్శనానికి వెళ్తుంటారు. అయితే కొంత కాలంగా నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గతంలో భక్తులపై చిరుతలు దాడులు చేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. కాగా TTD విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు.

Tirumala Alipiri | ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణతో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్టు TTD అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Also Read | TTD: తిరుమల నడక దారిలో మరో చిరుత ప్రత్యక్షం..