Home   »  ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణవార్తలు   »   PSLV C56 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌

PSLV C56 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌

schedule raju

చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇప్పుడు శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ (SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు ఉ.6.30కు చేపట్టనున్న PSLV C56 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది.

ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటు.. మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి PSLV C56 రాకెట్‌ చేర్చనుంది.. ఇందులో రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్‌ కూడా ఉంది. 25.30 గంటల పాటు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ కొనసాగిన తర్వాత రేపు ఉదయం అంటే ఆదివారం రోజు ఉదయం 6.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

కౌంట్ డౌన్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలంతా రాకెట్ లోని 4 దశలలో ఫ్యూయల్‌ని నింపే పనిపై ఫోకస్ పెడతారు. అలాగే.. వాతావరణాన్ని గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం 2 రోజులపాటు ఏపీ, తెలంగాణపై పెద్ద మేఘాలు వచ్చే అవకాశం లేదు. అందువల్ల వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, మరియు ఇతర కీలక శాస్త్రవేత్తలు షార్ చేరుకున్నారు.

ఈ నెలలో జరగనున్న రెండో ప్రయోగం ఇది. ఇప్పటికే చంద్రయాన్‌-3ని ISRO విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. AUG 23న ల్యాండర్‌ చంద్రుని మీదకు చేరనుంది.