Home   »  ఆంధ్రప్రదేశ్   »   జగన్ పై విరుచుకుపడ్డ AP బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

జగన్ పై విరుచుకుపడ్డ AP బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

schedule mahesh

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదనడం అవాస్తవమని A.P బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈరోజు (శనివారం) ఆమె పర్యటించడం జరిగింది. జంగారెడ్డి గూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది: Purandeshwari

జంగారెడ్డి గూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. నీళ్ళు తోడుకొడానికి ఉపయోగించుకోవాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బు తోడుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆమె మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని పురంధేశ్వరి అన్నారు.

ప్రజలకు నిజాలు చెప్పేందుకు త్వరలో పోలవరంలో పర్యటిస్తానన్న పురంధేశ్వరి

ప్రజలకు నిజాలు చెప్పేందుకు త్వరలో పోలవరంలో పర్యటిస్తానన్నారు. ఓటుతో సంబంధం లేకుండా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి వుందన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి ఎలా ఉన్నా Y.C.P ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.

పెట్టుబడులు పక్క రాష్ట్రాల వాళ్ళు తీసుకుపోతున్నా సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.

జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్న పురంధేశ్వరి

జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని పురంధేశ్వరి తెలిపారు. ఒక్క ఏలూరు జిల్లాకే కేంద్ర ప్రభుత్వం లక్ష ఇళ్లు మంజూరు చేసిందని ఆమె తెలిపారు. జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని పూర్తయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Also Read: పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై స్పందించిన చంద్రబాబు..