Home   »  ఆంధ్రప్రదేశ్   »   తిరుమలలో నేడు ప్రారంభమైన రథ సప్తమి మహోత్సవం..!

తిరుమలలో నేడు ప్రారంభమైన రథ సప్తమి మహోత్సవం..!

schedule raju

Ratha Saptami Mahotsavam | తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి మహోత్సవం ప్రారంభమైంది. రథసప్తమి వేడుకల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు దారి పొడవునా రంగురంగుల పుష్పాలంకరణ నిర్వహించారు.

Ratha Saptami Mahotsavam started today in Tirumala

Ratha Saptami Mahotsavam | మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి మహోత్సవం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సూర్య జయంతిని పురస్కరించుకుని TTD ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ మలయప్పస్వామి సప్తవాహనాల సేవలో భాగంగా ముందుగా సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి.

రథసప్తమి వేడుకలు | Ratha Saptami Mahotsavam

రథసప్తమి వేడుకల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారి నుదురు, నాభి, కమల పాదాలపై భానుడుగా పిలిచే తొలి సూర్యకిరణాల దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా TTD విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు దారి పొడవునా రంగురంగులతో పుష్పాలంకరణ నిర్వహించారు.

ఇందుకోసం దాదాపు ఏడు టన్నుల పూలు, 50,000 కట్ ఫ్లవర్లను ఉపయోగించారు. భక్తుల భద్రత కోసం TTD నిఘా, భద్రతా విభాగం, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

స్వామి వారి వాహన సేవల షెడ్యూల్ : –

  • 5.30-8.00 AM: సూర్య ప్రభ వాహనం
  • 9-10 AM: చిన్నశేష వాహనం
  • 11-12 AM: గరుడ వాహనం
  • 1-2 PM: హనుమంత వాహనం
  • 2-3 PM: చక్ర స్నానం
  • 4-5 PM: కల్పవృక్ష వాహనం
  • 6-7 PM: సర్వభూపాల వాహనం
  • రాత్రి 8-9 PM: చంద్రప్రభ వాహనం

తిరుమలలో ఈరోజు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనానికి అవకాశం ఉంటుంది. సర్వదర్శనం టోకెన్ల జారీని శనివారం వరకు తాత్కాలికంగా నిలిపివేసినందున, భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి శ్రీవారిని దర్శించుకోవచ్చు.

Also Read: 5,141 కోట్ల వార్షిక బడ్జెట్‌కు TTD ఆమోద ముద్ర.!