Home   »  ఆంధ్రప్రదేశ్   »   RGV Tweet | పవన్‌.. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వండి

RGV Tweet | పవన్‌.. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వండి

schedule raju

RGV Tweet | వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేయడం మానేశాడు. ఆయన కేవలం వివాదాస్పదమవుతాయి అనుకున్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరెవరు ఎలా ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎలాంటి కుట్రలు జరిగాయి అనే విషయం మీద తన కోణాలను ఆవిష్కరించేందుకు ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. గతంలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma )తో వంగవీటి లాంటి సినిమా చేసిన దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తుండగా రంగం సినిమాతో తెలుగువారికి పరిచయమైన అజ్మల్ ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: Ram Gopal Varma: ఇండియా పేరు మార్పుపై ఆర్జీవీ ట్వీట్‌

ఆలోచనల్లో, ఆచరణలో పెట్టే పనుల్లో రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు. వివాదాస్పద దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారిన ఆర్జీవీ.. వీలు కుదిరిన ప్రతిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేస్తుండటం కామనే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, ఏం చేసినా..వర్మకు ఓ ఇష్యూ దొరికినట్లే. ఛాన్స్ దొరికితే చాలు పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించడం హ్యబీగా పెట్టుకున్నారు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి అదే రిపీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

Also Read: Pawan Kalyan |చంద్రబాబు అరెస్ట్‌.. కక్షసాధింపు చర్యే: పవన్‌

చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో.. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. కుట్రపూరితంగానే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ ఈ 9 ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (RGV Tweet) ద్వారా స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ 9 ప్రశ్నలు

గౌరవనీయులైన శ్రీ @PawanKalyan గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్

  1. అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా??
  2. ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?
  3. 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?
  4. ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?
  5. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే… ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?
  6. చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?
  7. సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?
  8. లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్గరౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?
  9. నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా? థాంక్యూ అండి

అని పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇస్తూ ప్రశ్నలు సంధించారు ఆర్జీవీ. ఈ ప్రశ్నలకు ఎలాగూ పవన్ కళ్యాణ్ స్పందించరనుకోండి. కాకపోతే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆర్జీవీపై విరుచుకుపడుతున్నారు.