Home   »  ఆంధ్రప్రదేశ్   »   Road Accidents in AP : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..

Road Accidents in AP : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..

schedule ranjith

Road Accidents in AP | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్‌ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

ప్రధానాంశాలు:

  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • తుఫాన్‌ వాహనం, లారీ ఒకదానికొకటి ఢీ
  • తూఫాన్ వాహనంలో 16 మంది
  • ఐదుగురు అక్కడికక్కడే మృతి

ఎపిలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవిపల్లి మండలం మఠంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం, లారీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా అతుని తాలూకా బడచి గ్రామానికి చెందిన 16 మంది తిరుమల దర్శనం చేసుకుని గురువారం రాత్రి స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యలో శుక్రవారం ఉదయం 3.30 గంటల సమయంలో.. కడప -చిత్తూరు జాతీయ రహదారిలోని మఠంపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న తూఫాన్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో 16 మంది ఉండగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తీర్థయాత్ర నిమిత్తం బయలుదేరిన వీరు మొదటగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తిరుమలకు వెళ్లి అక్కడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో తల్లి కుమార్తెలు శోభ (36), అంబికా (14) తో పాటు మనంద (32), డ్రైవర్ హనుమంతు (42)ఉన్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 11 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతిలోని రూయ ఆసుపత్రికి తరలించారు.

Road Accidents in AP | ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీ

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగానే ఉంది.

వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ భువనేశ్వర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

డ్రైవర్ నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.