Home   »  ఆంధ్రప్రదేశ్   »   రత్నగిరి కొండపై ప్రత్యేక రహదారులు

రత్నగిరి కొండపై ప్రత్యేక రహదారులు

schedule sirisha

రాజమహేంద్రవరం: రత్నగిరి కొండపై గల ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. దాదాపు 70 శాతం మంది భక్తులు తమ సొంత కార్లు, ప్రయాణ వాహనాల్లో వస్తారని అంచనా. కార్తీక మాసం, ఏకాదశి, ఇతర పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ 5 వేల నుంచి 6 వేల వరకు కార్లు, ఇతర వాహనాలు వస్తుంటాయి. వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపోకపోవడంతో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

రత్నగిరి కొండపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొండపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిర్మాణాలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. సత్యగిరి వై జంక్షన్‌లో దాదాపు 800 కార్లు ఉండేలా మల్టీ లెవల్‌ పార్కింగ్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దర్శనానంతరం భక్తులు తమ కార్లను తిప్పకుండా పాత సిఆర్‌ఓ కార్యాలయం వైపు నుండి కొండ దిగువకు చేరుకోవచ్చు.