Home   »  ఆంధ్రప్రదేశ్   »   Jagan disproportionate assets case | జగన్‌ అక్రమాస్తుల కేసు.. CBI జాప్యాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Jagan disproportionate assets case | జగన్‌ అక్రమాస్తుల కేసు.. CBI జాప్యాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

schedule raju
Supreme Court questioned CBI delay in Jagan disproportionate assets case

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో (Jagan disproportionate assets case) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ MP రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం సమీక్షించింది.

రాజకీయ కారణాలతో దర్యాప్తులో జాప్యం

ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసు (Jagan disproportionate assets case) దర్యాప్తులో జాప్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ప్రశ్నించింది. ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని CBIని ఆదేశించిన కోర్టు, విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది.

డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయడం వల్లే విచారణలో జాప్యం జరుగుతోందని CBI తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజు పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో దర్యాప్తులో జాప్యం చేయరాదని ధర్మాసనం ఉద్ఘాటించింది. అయితే, ఒక ముఖ్యమంత్రి లేదా రాజకీయ నాయకుడు అని దర్యాప్తులో జాప్యం చేయరాదని పేర్కొంది. కేసు దర్యాప్తును బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా రెండు పిటిషన్లను కలిపి పరిశీలిస్తామని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 కి వాయిదా పడింది.

Also Read: APలో కాంగ్రెస్ పార్టీ 9 హామీలను ప్రకటించిన వైఎస్ షర్మిల..!