Home   »  ఆంధ్రప్రదేశ్   »   తిరుపతి కి కాలినడకన వెళ్లే భక్తులకు ఆంక్షలు తప్పవు

తిరుపతి కి కాలినడకన వెళ్లే భక్తులకు ఆంక్షలు తప్పవు

schedule sirisha

తిరుపతి: తిరుపతి భక్తులకు ప్రమాదకరంగా మారిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లే దారిలో వన్యప్రాణుల సంచారాన్ని అరికట్టాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులు తినుబండారాలను తీసుకొని వెళ్లకూడదని ఆంక్షలు విధించనున్నారు.

తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర ఆలయ అధికారిక సంరక్షకుడు తెలిపిన వివరాల ప్రకారం, తినుబండారాలను భక్తులు జంతువులకు వేయడం వల్ల జింకలు, కోతులు, కుందేళ్లు వంటి పలు రకాల జీవులు రావటం వల్ల వాటి కోసం క్రూరమృగాలు రావడంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. అందువల్ల పాదచారులకు కొన్ని ఆంక్షలు విధించడం జరిగిందని అన్నారు.