Home   »  ఆంధ్రప్రదేశ్   »   తిరుమల శ్రీవారి మే నెల టిక్కెట్లు నేడు విడుదల..!

తిరుమల శ్రీవారి మే నెల టిక్కెట్లు నేడు విడుదల..!

schedule raju

Tirumala May Month Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త తెలిపిన TTD. తిరుమల శ్రీవారి మే నెల దర్శనానికి సంబంధించిన టిక్కెట్లు నేడు విడుదలకానున్నాయి. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగుల దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తారు.

Tirumala May Month Tickets releasing today

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త తెలిపిన TTD. తిరుమల శ్రీవారి మే నెల టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ కోటా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన చేసింది. లక్కీ డిప్ విధానంలోకి వచ్చేందుకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని TTD తెలిపింది.

Tirumala May Month Tickets వివరాలు

అలాగే 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కీ డిప్ విధానంలో టికెట్లు జారీ చేసినట్లయితే, భక్తులు ఆన్‌లైన్ విధానంలో చెల్లించి టిక్కెట్లు పొందేందుకు గడువు ఉంటుంది. ఇక ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు.

ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగుల దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు డార్మిటరీ గది కోటాను TTD విడుదల చేయనుంది. ఈ టిక్కెట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (అధికారిక వెబ్‌సైట్.. https://www.tirumala.org/ ) ను సంప్రదించాలి అని అధికారులు తెలిపారు.

Also Read: తిరుమలలో నేడు ప్రారంభమైన రథ సప్తమి మహోత్సవం..!