Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఒంటరి జీవితం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఒంటరి జీవితం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

schedule sirisha

కడప: ఒంటరి జీవితంపై విరక్తి కలిగి పుల్లంపేటకు చెందిన జయరామయ్య (50) మద్యంలో విషం కలుపుకొని తాగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం, జయరామయ్య బాగా సంపాదించాడు. ఆయన భార్య ఏడేళ్ల కిందట మరణించింది. పిల్లలిద్దరినీ బాగా చదివించాడు.

వాళ్ళు ఉద్యోగ రీత్యా ఇతర విదేశాలలో ఉన్నారు. స్వగ్రామంలోని ఇంట్లో ఒక్కడే ఉండటంతో తన ఒంటరి జీవితం పై విరక్తి చెంది సోమవారం మద్యంలో విషం కలుపుకొని తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుల్లంపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.