Home   »  ఆంధ్రప్రదేశ్   »   డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు…

డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు…

schedule sirisha

తిరుమల: డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) ని వైభవంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వారము నుండి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 23 నుండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను ఈ నెల‌ 10వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 10 రోజులకీ 2.25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది.

రోజుకి 2వేలు చొప్పున 20 వేల శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను భక్తులకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో కి తీసుకువస్తుంది. వచ్చే నెల 21వ తేదీ వేకువజామున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో జారీ చేస్తారు. 10 రోజుల గానూ 4.25 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేస్తారు.

వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలకు రోజుకి 2వేల టోకెన్లు

వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చిన 10 రోజుల్లోనే సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర విశేష దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు.

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగిందన్నారు. గురువారం శ్రీవారిని 59,335 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీలో కానుకగా సమర్పించిన నగదు రూ. 3.29 కోట్లు.

కాగా స్వామివారికి 23,271 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఉదయం 11 గంటల వరకు 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల పాటు వీచి ఉండాల్సి వస్తుంది.