Home   »  ఆంధ్రప్రదేశ్   »   నవంబర్ 5న వైజాగ్ నేవీ మారథాన్ పోటీలు…

నవంబర్ 5న వైజాగ్ నేవీ మారథాన్ పోటీలు…

schedule sirisha

విశాఖపట్నం: ఆదివారం జరగనున్న వైజాగ్ నేవీ మారథాన్ (Vizag Navy Marathon) ఎనిమిదో ఎడిషన్‌కు డెస్టినీ నగరం ముస్తాబైంది. వివిధ కేటగిరీల్లో రిజిస్ట్రేషన్‌లకు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

అత్యంత సాహసోపేతమైన పూర్తి మారథాన్ అంటే 42 కి.మీ రేసును ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఉదయం 4.15 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.

Vizag Navy Marathon లో నాలుగు కేటగిరీలు

ఈ ఈవెంట్‌లో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. ఫుల్ మారథాన్ (42.2 కిమీ), హాఫ్ మారథాన్ (21.1 కిమీ), 10 కిమీ రన్ మరియు 5 కిమీ రన్. మారథాన్ కోసం రేసులు ది పార్క్ హోటల్ సర్కిల్, RK బీచ్ నుండి నావల్ కోస్టల్ బ్యాటరీ వైపు ప్రారంభిస్తారు.

RK బీచ్ వద్ద కాళీమాత ఆలయం దగ్గర U-టర్న్ తీసుకోవాలి. 5K రన్ MGM పార్క్, VMRDA వద్ద ముగిసి పోతుంది. ఇతర కేటగిరీ రేసుల రన్నర్లు INS కళింగ వైపు సహజమైన బీచ్ రోడ్డులో కొనసాగుతారు.

రన్నర్‌ల ఉత్సాహం కోసం వినోదాన్ని పంచె కార్యక్రమాలు

10K రన్నర్లు తెన్నేటి పార్క్ దగ్గర U-టర్న్ తీసుకుంటారు. కానీ హాఫ్ మారథాన్ రన్నర్లు రుషికొండ సమీపం లోని గాయత్రీ కాలేజీ దగ్గర యూ-టర్న్ తీసుకోవాలి. పూర్తి మారథాన్ రన్నర్లు INS కళింగ సమీపంలోని తేమల ఉప్పాడ దగ్గర U-టర్న్ తీసుకోవాలి.

అన్ని రేసులు MGM పార్క్, VMRDA వద్ద ముగుస్తాయి. ఈ సంవత్సరం మారథాన్‌కు సంబంధించిన ఏర్పాట్లలో హైడ్రేషన్ మరియు మెడికల్ పాయింట్‌లు, కంఫర్ట్ స్టేషన్‌లు, రన్నర్‌లను ఉత్సాహంగా ఉంచడానికి రేసు మార్గంలో వినోదాన్ని పంచె కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

Also read : హైదరాబాద్ నుండి కొలంబోకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించిన ఇండిగో