Home   »  ఆంధ్రప్రదేశ్   »   మేదరమెట్ల “సిద్ధం’ సభలో YCP మేనిఫెస్టో రిలీజ్‌..!

మేదరమెట్ల “సిద్ధం’ సభలో YCP మేనిఫెస్టో రిలీజ్‌..!

schedule raju

YCP Manifesto 2024 | AP ఎన్నికలలో వేడి రాజుకుంటుంది. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదని ప్రచారం చేసుకుంటున్నాయి. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం YSR కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నామని YCP ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

YCP Manifesto 2024 release at Medarametla Siddham program

AP ఎన్నికలలో వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదని ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసి, జనాన్ని తమకు అనుకూలంగా మార్చడంలో కీలకంగా పనిచేసే ఎలక్షన్ మేనిఫెస్టోలపై అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అధికారంలోకి రావాలని భావించే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టేశాయి.

YCP Manifesto 2024

APలో ఐదేళ్ల క్రితం నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో సక్సెస్ అయ్యింది. అయితే, తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం YSR కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10న బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో జరిగే “సిద్ధం” సభలో తమ పార్టీ మేనిఫెస్టో (YCP Manifesto 2024) ప్రకటించనున్నట్లు YCP ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ ఐదేళ్లలో మేం ఏం చేశామో, భవిష్యత్‌లో ఏం చేస్తామో వివరిస్తాం. అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో మేనిఫెస్టో రూపొందించి ప్రకటిస్తాం. సిద్ధం సభకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం. ఒక సభకు మించి మరో సభకు జనం పోటెత్తుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలపై జగన్ దృష్టి

పార్టీ వర్గాల ప్రకారం.. మేనిఫెస్టోలో రూ. 1 లక్ష వరకు పంట రుణాల మాఫీ, పెన్షన్ల పెంపుదల మరియు మహిళల కోసం కొన్ని ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయి. ‘అభివృద్ధి కార్యక్రమాలు, సంపదను పెంచే పథకాలకు బదులు జగన్ మరోసారి సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తున్నారు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read: రైతు భరోసా నిధులు విడుదల చేసిన CM..!