Home   »  ఆంధ్రప్రదేశ్   »   పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌

పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌

schedule raju

విధి నిర్వహణలో భాగంగా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan) శనివారం నివాళులర్పించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం ఉదయం జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని Ys Jagan హామీ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది వెన్ను చూపని యోధులని, ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తారని, పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంగళ్లు హింసాత్మక ఘటన

అంగళ్లు హింసాత్మక ఘటనను గుర్తుచేసిన వైఎస్ జగన్.. పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలను కాపాడాలన్నారు. ఆ ఘటనలో 40 మంది పోలీసులు గాయపడ్డారని, ఒక పోలీసు కన్ను పోయిందని పేర్కొన్నారు. సంఘ వ్యతిరేకుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.

పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వైద్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌తోపాటు ఏపీలో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

Also Read: హైకోర్టులో సీఎం జగన్ కు ఊరట… మొత్తానికి ఆ కేసుపై హైకోర్టు స్టే