Home   »  ఆంధ్రప్రదేశ్   »   RK వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన వైఎస్ జగన్

RK వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన వైఎస్ జగన్

schedule raju

కడప: కడప జిల్లా ఇడుపులపాయలో RK వ్యాలీ పోలీస్‌స్టేషన్‌, జమ్మలమడుగు పోలీస్‌ స్టేషన్‌లను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి YS జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కడపలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా YS జగన్ (YS Jagan) గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, రెండో రోజు పర్యటనను కొనసాగించారు.

ఎకో పార్క్‌లో YS Jagan సమావేశం

ఎకో పార్క్‌లో వేముల మండల పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమై ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 11.50 గంటలకు గన్నవరం బయల్దేరుతారు.

తొలిరోజు పులివెందుల మున్సిపాలిటీలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రికి మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్‌లో అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఘనస్వాగతం లభించింది.

16.5 అడుగుల YS .రాజశేఖర్ రెడ్డి విగ్రహం

పులివెందులలో 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్, 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా. YS .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (Ropeway), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.

Also Read: టీడీపీ-జనసేన కలిసి ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ ప్రచారం