Home   »  ఆంధ్రప్రదేశ్వార్తలు   »   సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు..

సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు..

schedule mounika

గుంటూరు: సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఐదుగురు సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసిన వై.ఎస్.ఆర్ జిల్లా పోలీసులు. నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలు తయారుచేసే సామాగ్రి స్వాధీనం. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బు స్వాహా. వినియోగదారుల నకిలీ వేలి ముద్రల సేకరణ ద్వారా లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు. వెబ్సైట్ల ద్వారా డాక్యుమెంట్లను సేకరించి వాటిలోని వేలిముద్రలను నకిలీవిగా తయారు చేస్తున్న ముఠా. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు మాయమవుతుండటం పై వినియోగదారుల ఫిర్యాదులు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు కొట్టేసిన ముద్దాయిలు..విచారణ లో రూ.5.9 కోట్ల ఆర్ధిక లావాదేవీలు గుర్తించిన పోలీస్ అధికారులు. ముద్దాయిలపై ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్లు, 412 ఎన్సీఆర్పి పిటిషన్లు నమోదు. ముద్దాయిల 12 అకౌంట్లను సీజ్ చేసి ఈడీకి పంపనున్న పోలీసులు.ముద్దాయిలు వినియోగించిన సమాచార వెబ్సైట్ల మూసివేతకు సిఫారసు చేయనున్న పోలీసు అధికారులు. సైబర్ నేరగాళ్ళను అరెస్టు చేసి కీలక సామాగ్రి ని, కారు ను స్వాధీనం చేసుకోవడం లో విశేష కృషి చేసిన అదనపు ఎస్పీ. (అడ్మిన్)పర్యవేక్షణలో కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, సైబర్ క్రైమ్ డి.ఎస్పీ బాలస్వామి రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, చిన్న చౌకు సి.ఐ నరసింహా రెడ్డి, కడప టూ టౌన్ సి.ఐ సయ్యద్ హాషం, సైబర్ క్రైమ్ ఎస్.ఐ ఎ.మధుమల్లేశ్వర రెడ్డి, చిన్న చౌకు ఎస్.ఐ రవి కుమార్, టూ టౌన్ ఎస్.ఐ పి. జయరాములు, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు.