Home   »  ఆంధ్రప్రదేశ్   »   27 మంది పేర్లతో YSRCP కొత్త ఇంఛార్జ్‌ల రెండో జాబితా విడుదల..

27 మంది పేర్లతో YSRCP కొత్త ఇంఛార్జ్‌ల రెండో జాబితా విడుదల..

schedule mounika

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ YSRCP దూకుడు పెంచింది. YSRCP మంగళవారం 27 మంది పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇంతకుముందు 11 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 38 నియోజకవర్గాల్లో అధికార పార్టీ మార్పులు చేసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కనీసం 50 మందిని మార్చాలని తొలుత భావించినా.. శ్రేణుల్లో పెద్ద ఎత్తున విభేదాలు రావడంతో పాటు వేగంగా మారుతున్న రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి 38 నియోజకవర్గాల్లో మార్పులకే పరిమితమైంది.

YSRCP

27 మంది పేర్లతో రెండో జాబితాను YSRCP విడుదల చేసింది. ఇంతకుముందు 11 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 38 నియోజకవర్గాల్లో అధికార పార్టీ మార్పులు చేసింది.

మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్న పేర్ని కృష్ణమూర్తి..

మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్లుగా, పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది, కానీ సామాజిక న్యాయం కూడా అందేలా చూసింది. ముగ్గురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. జాబితా ప్రకారం పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారు. మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని Y.S.R.C.P కోరినప్పటికీ, ఆయన పోటీ నిరాకరించి తన కుమారుడిని పోటీలోకి తెచ్చుకున్నారు.

విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్న వెల్లంపల్లి శ్రీనివాస రావు

విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస రావు అభ్యర్థిగా, విజయవాడ వెస్ట్ నుంచి మల్లాది విష్ణు స్థానంలో షేక్ ఆసిఫ్‌ను పార్టీ ఎంపిక చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత విష్ణును శాసనమండలికి పంపనున్నారు. M.భరత్ కుమార్ ను అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరారు.

27 మందితో కూడిన YSRCP కొత్త ఇంఛార్జుల రెండో జాబితా..

  • అనంతపురం ఎం.పీ -మాలగుండ్ల సత్యనారాయణ
  • హిందూపురం ఎం.పీ- జోలదరాశి శాంత
  • అరకు ఎం.పీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
  • రాజాం- తాలే రాజేశ్
  • అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
  • పాయకరావుపేట- కంబాల జోగులు
  • రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
  • పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్
  • పిఠాపురం- శ్రీమతి వంగ గీత
  • జగ్గంపేట- తోట నరసింహులు
  • ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు
  • రాజమండ్రి సిటీ- మార్గాని భరత్
  • రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ
  • పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి
  • కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
  • ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
  • తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
  • గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
  • మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి
  • చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్
  • కల్యాణదుర్గం- తలారి రంగయ్య
  • అరకు- గొడ్డేటి మాధవి
  • పాడేరు-విశ్వేశ్వర రాజు
  • విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
  • విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్

ALSO READ: నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ ప్రారంభం..