Home   »  ఆంధ్రప్రదేశ్   »   Yuvagalam Attack: యువగళం కార్యకర్తలకు 14 రోజుల రిమాండ్‌

Yuvagalam Attack: యువగళం కార్యకర్తలకు 14 రోజుల రిమాండ్‌

schedule raju

Yuvagalam Attack: పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై మంగళవారం రాత్రి వైసీపీ అల్లరి మూకలు దాడులకు (Yuvagalam Attack) తెగబడగా యువగళం వలంటీర్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో 38 మంది టీడీపీ యువగళం కార్యకర్తలు, 14 మంది నేతలకు భీమవరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

దీంతో వారిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఘటనా స్థలంలో లేని వ్యక్తులపై అక్రమంగా కేసులు పెట్టారని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు పాల్పడ్డారని పోలీసులు సాక్షాధారాలు సమర్చించారు.

Yuvagalam : 50 మంది యువగళం వాలంటీర్లు, సిబ్బంది అరెస్ట్‌

 నేపథ్యంలో గునుపూడి ఏరియాలోని యువగళం క్యాంప్‌ వద్దకు తెల్లవారుజామున చేరుకున్న పోలీసులు యువగళం వలంటీర్లు, కిచెన్‌ సిబ్బంది, క్యాంప్‌ ఏర్పాటు చేసే సిబ్బందితో సహా సుమారు 50 మందిని అరెస్టు చేశారు.

దీంతో ఒక్కసారిగా టీడీపీ నాయకులు, పోలీసు వాహనాలకు అడ్డుగా నిలవడంతో ఆకివీడు రూరల్‌ సీఐ సత్యనారాయణ, టీడీపీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరకు యువగళం టీమ్‌ సభ్యులను పోలీసులు ఆకివీడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోలమూరు లో లోకేశ్ … 24 గంటలు తాగునీరు అందిస్తామని హామీ

టీడీపీ నాయకులు ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి యువగళం వలంటీర్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గానికి చెందిన దయం బెంజిమెన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు, కానిస్టేబుల్‌ దొంగ రమేష్‌ ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు.

ఈ రెండూ కాకుండా భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షుడు తోట భాగయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు పెట్టారు.

చేసిన కేసుల్లో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తదితరులతో పాటు 52 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

వీరిలో 38 మంది యువగళం వాలంటీర్లు ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న 20 గంటల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.