Home   »  వ్యాపారం   »   2024, 23 January Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

2024, 23 January Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

schedule sirisha

2024, 23 January Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం భారీగా పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,868.20 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది.

23 January Stock Market

23 January Stock Market | భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

2024, 23 January Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,868.20 పాయింట్ల వద్ద లాభాలతో మొదలై, ఆ తర్వాత FMCG, బ్యాంకులు, మెటల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సెనెక్స్ భారీ నష్టాల్లోకి వెళ్లింది. ఒక దశలో 72,039.20 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, 70,234.55 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.చివరకు 1,053.10 పాయింట్లు కోల్పోయి 70,370.55 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కూడా 333 పాయింట్లు పతనమై 21,238.80 వద్ద ముగిసింది. నిఫ్టీలో IndusInd Bank, Coal India, ONGC, Adani Ports, SBI Life Insurance అత్యధికంగా నష్టపోయాయి. సిప్లా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ICICI బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా మినహా అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. BSE లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 3 శాతం క్షీణించినట్లు సమాచారం.

Also read: లీక్ అయిన Lenovo Tab K11 టాబ్లెట్‌ వివరాలు.!