Home   »  వ్యాపారం   »   మార్చి 2024 వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించిన భారత్!

మార్చి 2024 వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించిన భారత్!

schedule sirisha

న్యూఢిల్లీ : India bans onion exports | దేశీయంగా లభ్యత పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించినట్లు వెల్లడించింది.

India bans onion exports

India bans onion exports | ఉల్లి ఎగుమతులను నిషేధించిన భారత్

ఉల్లిపాయల ఎగుమతి ని మార్చి 31, 2024 వరకు నిషేధించబడింది” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఢిల్లీలో స్థానిక వ్యాపారులు కిలో ఉల్లిని రూ.70-రూ.80కి విక్రయిస్తున్నారు.

వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు బఫర్ ఉల్లి స్టాక్‌ను కిలోకు రూ.25 సబ్సిడీపై రిటైల్ మార్కెట్‌లలో విక్రయించాలని అక్టోబర్‌లో కేంద్రం నిర్ణయించింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం గతంలో అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర (MEP) విధించింది.

ఆగస్టులో, భారతదేశం డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయల ఎగుమతిపై 40 శాతం పన్నుని విధించింది. అయితే ఇతర దేశాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఇచ్చే అనుమతి ఆధారంగా ఉల్లి ఎగుమతులకు అనుమతిస్తామని డీజీఎఫ్‌టీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందు లోడింగ్ ప్రారంభించబడిన ఉల్లిపాయ సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also read: టొమాటో జ్యూస్ రోజూ తాగితే ఈ 3 లాభాలు ఖాయం..