Home   »  వ్యాపారం   »   IndiGo: టికెట్‌ ధరలు పెంచిన ఇండిగో..

IndiGo: టికెట్‌ ధరలు పెంచిన ఇండిగో..

schedule ranjith

విమాన టికెట్‌ ధరలపై ఏటీఎఫ్‌ ఛార్జీ విధిస్తున్నట్లు దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ
ఇండిగో (IndiGo) వెల్లడించింది. విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వెల్లడించింది. ప్రయాణ దూరాన్ని బట్టి ఇది ప్రతి టికెట్‌పై రూ.300-1000 వరకు పెరుగుతుందని
తెలిపింది.

భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న విమానయాన సంస్థ IndiGo

అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్‌ ధరలు దూసుకుపోతుండటంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు ఇంధన చార్జ్‌ విధించడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ఏకంగా రూ.1,000 వరకు విధించబోతున్నట్టు ప్రకటించింది.

కిలోమీటర్ల దూరాన్ని బట్టి చార్జి వసూలు

దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కిలోమీటర్ల దూరాన్ని బట్టి చార్జి వసూలు చేస్తున్నది. 500 కిలోమీటర్ల వరకు రూ.300 వసూలు చేస్తున్న సంస్థ..గరిష్ఠంగా 3,500 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.1,000 విధిస్తున్నది. ఈ చార్జీలు అక్టోబర్ 06 శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. సంస్థల నిర్వహణలో సగానికి పైగా ఇంధన కోసం ఖర్చు చేస్తుండటంతో ఆయా సంస్థలపై అధికభారం పడుతుంది.

విమానయాన సంస్థల ఇంధన చార్జ్‌ పెంపు

 ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు విమాన ఇంధన ధర భారీగా పెంచుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOC) విమాన ఇంధన కిలో లీటర్‌ ధర రూ.5,779.84 లేదా 5.1 శాతం పెంచింది దీంతో కిలో లీటర్‌ ధర రూ.1,13,419.33 నుంచి రూ.1,18,199.17కి చేరుకున్నది. ఆగస్టు 1న లీటర్‌ ధర 8.5 శాతం(రూ.7,728.38), సెప్టెంబర్‌ 1న 14.1 శాతం(రూ.13,911.07) పెంచిన సంస్థలు..ఈ నెల మొదట్లో 5 శాతం రేట్లు పెంచాయి.

ప్యూయల్‌ చార్జ్‌లు,కిలోమీటర్ల వారీగా…

దూరం
(కిలోమీటర్లు)
ప్యూయల్‌ చార్జ్‌
(రూ.లో)
0-500300
501-1000400
1001-1500550
1501-2500650
2501-3500800
3500-కంటే అధికం1000
Also Read: సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త… SBI ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం