Home   »  వ్యాపారం   »   Moto G34 5G భారతదేశంలో విడుదల… ధర మరియు వివరాలు

Moto G34 5G భారతదేశంలో విడుదల… ధర మరియు వివరాలు

schedule raju

Lenovo యాజమాన్యంలోని Moto బ్రాండ్ నుండి తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G34 5G మంగళవారం (జనవరి 9) భారతదేశంలో విడుదల అయింది. భారతదేశంలో Moto G34 5G బేస్ మోడల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ను రూ. 11,999 ధరతో విడుదల చేసారు.

Moto G34 5G Launched in India

Lenovo యాజమాన్యంలోని Moto బ్రాండ్ నుండి తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ Moto G34 5G మంగళవారం (జనవరి 9) భారతదేశంలో విడుదల చేసారు. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Moto G 34 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు Snapdragon 695 SoCపై నడుస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అంతేగాక Moto G 34 5G 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదట విడుదల చేసారు.

భారతదేశంలో Moto G34 5G ధర, లభ్యత

భారతదేశంలో Moto G 34 5G బేస్ మోడల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 11,999 తో విడుదల చేసారు. ఇది చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ మరియు ఓషన్ గ్రీన్ రంగులలో వస్తుంది. గ్రీన్ వేరియంట్‌లో వేగన్ లెదర్ ఫినిషింగ్ రియర్ ప్యానెల్ కూడా ఉంది.

కొత్త Moto G 34 5G జనవరి 17 నుండి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయించబడుతుంది.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) Moto G 34 5G ఆండ్రాయిడ్ 14తో అందించబడుతుంది మరియు కంపెనీ ఆండ్రాయిడ్ 15 వరకు అప్‌గ్రేడ్ అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 269ppi పిక్సెల్ డెన్సిటీ మరియు 580నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిస్ప్లే పైభాగంలో హోల్ పంచ్ కటౌట్ ఉంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ పాండా గ్లాస్ రక్షణను కలిగి ఉంది. ఇది 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ Snapdragon 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ యొక్క మెమరీని వర్చువల్‌గా 16GB వరకు పెంచుకోవచ్చు.

Moto G34 5G కెమెరా సెటప్‌

ఆప్టిక్స్ కోసం, Moto G 34 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు LED ఫ్లాష్‌తో పాటు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5G స్మార్ట్‌ఫోన్‌లో 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

Moto G34 5Gలోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్, FM రేడియో, GPS/A-GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

Moto G34 5G 20W TurboPower ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని కొలతలు 162.7×74.6x8mm మరియు బరువు 179 గ్రాములు ఉన్నాయి. వేగన్ లెదర్ వెర్షన్ బరువు 181 గ్రాములుగా ఉంది.

Also Read: Redmi Note 13 5G, Note 13 Pro 5G, Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో విడుదల!