Home   »  వ్యాపారం   »   Oppo Find N3 గ్లోబల్ మార్కెట్లో విడుదల… ధర మరియు వివరాలు.!

Oppo Find N3 గ్లోబల్ మార్కెట్లో విడుదల… ధర మరియు వివరాలు.!

schedule raju

ఫ్లిప్ ఫోన్ తర్వాత, Oppo తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. Oppo Find N3 ఒక బుక్-స్టైల్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌గా మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో లాంచ్ చేసారు. ఈ ఫోన్ 1,00,000 సార్లు ఫోల్డ్ టెస్ట్ చేయబడిందని తెలిపారు.

Oppo Find N3 ధర

Oppo Find N3 సింగపూర్‌లో మొదట విడుదల చేసారు. SGD 2399 ధరతో 16 GB RAM మరియు 256 GB స్టోరేజ లో అందించబడిన ఏకైక వేరియంట్ ఇది దాదాపు రూ. 1,45,300 ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ షాంపైన్ గోల్డ్ మరియు క్లాసిక్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్ కోసం కూడా అందుబాటులో ఉంది. అయితే, ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టం చెయ్యలేదు.

Oppo ఫైండ్ N3 యొక్క స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ Android 13 ColorOS 13 ఆధారంగా రూపొందించబడింది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 7.82-అంగుళాల 2K (2268 x 2440 పిక్సెల్‌లు) LTPO 3.0 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో, టచ్ శాంపిల్ రేటు 240 Hz గా ఉంది. అలాగే, 2800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించబడుతుంది.

Oppo Find N3 ప్రాసెసర్‌

ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది Adreno 740 GPUని కలిగి ఉంది. ఇది 16 GB RAMతో 512 GB స్టోరేజ్ ని కలిగి ఉంది. ఫోన్ 3x ఆప్టికల్ జూమ్‌తో వచ్చే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 64-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ కెమెరా ను కలిగి ఉన్న హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

అలాగే, 48-మెగాపిక్సెల్ Sony LYTIA-T808 1/1.42-అంగుళాల ప్రైమరీ కెమెరా అందించబడింది. మూడవ కెమెరా 48-మెగాపిక్సెల్ సోనీ IMX581 సెన్సార్ ని కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 20-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే, బాహ్య స్క్రీన్‌పై 32-మెగాపిక్సెల్ సెకండరీ సెల్ఫీ కెమెరా అందించబడింది.

Oppo Find N3 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS/ A-GPS, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. దీనితో పాటు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. 67W SuperWook 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4805mAh బ్యాటరీతో ఫోన్ ఛార్జ్ చేయబడుతోంది. ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీ అంటే రెండు బ్యాటరీ సెల్స్ ని ఉపయోగిస్తుంది..

Also Read: బిగ్-C నుండి దసరా ధమాకా ఆఫర్లు