Home   »  వ్యాపారం   »   Real Estate | హైదరాబాద్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్… కారణం ఇదే…

Real Estate | హైదరాబాద్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్… కారణం ఇదే…

schedule sirisha

Real Estate | వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. మంచి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. వరల్డ్ క్లాస్ టాప్ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ శాఖలను ప్రారంభిస్తున్నాయి.

Real estate boom in Hyderabad... This is the reason...

హైదరాబాద్: Real Estate | వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. మంచి అనుకూల వాతావరణం, మంచి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. వరల్డ్ క్లాస్ టాప్ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ శాఖలను ప్రారంభిస్తున్నాయి. వ్యాపారవేత్తల నుంచి ఉన్నతాధికారుల వరకు ఇదే ఒరవడి కొనసాగుతుండడంతో భూములకు డిమాండ్ లు పెరుగుతూ హైదరాబాద్ ముందుకు సాగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌కి మరో పేరు మినీ ఇండియా

అన్ని సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని మినీ ఇండియా అని అంటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా హైదరాబాదే. ఇక్కడి ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధితో పాటు నగరంలో అనుకూల వాతావరణం ఉండటం వల్ల హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఉద్యోగ, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు చూసి హైదరాబాద్ సిటీలో స్థిర నివాసం ఉండేందుకు అందరూ ఇష్టపడతారనడంలో సందేహం లేదు.

నగరంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కోరిక

తెలుగు ప్రజల రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశం ఉన్న వారిలో ఎక్కువ మంది నగరంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే కొంతకాలంగా నగరంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండే ప్రాంతాలలో ఇళ్లు, ప్లాట్లు కొనేందుకు ఉత్తర భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ కావడం.. మంచి ఉపాధి సౌకర్యాలు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కారణంగా చెప్పవచ్చు.

హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం ఒక కారణం

హైదరాబాద్‌కు మరో మంచి అవకాశం వాతావరణం. ఇక్కడ మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని వయసుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నగరంలో మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల ఆహార పదార్థాల లభ్యత, దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు-రైలు నెట్‌వర్క్ మరియు అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్‌కు అభివృద్ధికి కారణమని చెప్పవచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలు ఉన్నందున హైదరాబాద్‌ చాలా మందిని ఆకర్షిస్తుంది.

నగరంలో స్థిరపడిన అధినేతలు

చాల మంది ప్రముఖులు హైద్రాబాద్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జేమ్స్ మైఖేల్ లింగ్డో హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. గతంలో ప్రదాన కార్యదర్శులు S,K జోషి, సోమేశ్‌కుమార్‌లు కూడా సీటీలో సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. నగరంతో చాలా కాలంగా ఉన్న అనుబంధం కారణంగా వాణిజ్య, వ్యాపార వర్గాల ఉన్నతాధికారులు సైతం నగరంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో సొంత ఆస్తులు, ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఉత్తర భారతీయులు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో స్థిరాస్తి వ్యాపారులకు కొంత ఊరట లభించనుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

Also read: తుక్కుగూడ తక్కువ పెట్టుబడి… ఎక్కువ లాభాలు.. ఎందుకంటే…