Home   »  వ్యాపారం   »   Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన మార్కెట్లు

schedule ranjith

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు… వెంటనే అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

Stock Market: Markets that start with gains and end with losses

నష్టాలతో ముగిసిన Stock Market

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం 72.464 వద్ద స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో ‘71.681 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 379.46 పాయింట్లు నష్టపోయి 71.892 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా స్వల్ప లాభాలతో ప్రారంభమై మార్కెట్‌ ముగిసే సమయానికి 76.10 పాయింట్లు నష్టపోయి 21,665.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి రూ.83.22గా ట్రేడ్ అయింది.

BSE సెన్సెక్స్ టాప్ గెయినర్స్

సన్ ఫార్మా (2.85%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), భారతి ఎయిర్ టెల్ (1.06%), రిలయన్స్ (0.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.70%).

టాప్ లూజర్స్

మహీంద్రా అండ్ మహీంద్రా (-2.78%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.46%), కోటక్ బ్యాంక్ (-2.41%), ఎల్ అండ్ టీ (-2.36%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.91%).

Also Read: Apple productsపై భారీ తగ్గింపు… అతి తక్కువ ధరకు ఆపిల్ ఉత్పత్తులు