Home   »  వ్యాపారం   »   Today 19 March 2024 Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Today 19 March 2024 Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

schedule raju
Today 19 March 2024 Stock Market ended in losses

Today 19 March 2024 Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 72,462.94 పాయింట్ల వద్ద భారీ నష్టంతో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. ఇంట్రాడేలో 72,490.09 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ ఒక దశలో 71,933.35 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 736.38 పాయింట్ల నష్టంతో 72,012.05 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 238.20 పాయింట్లు కోల్పోయి 21,817.50 వద్ద స్థిరపడింది. ఈరోజు ట్రేడింగ్ (Today 19 March 2024 Stock Market) ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ట్రేడింగ్‌లో దాదాపు 1202 షేర్లు పెరగ్గా, 2,458 షేర్లు పతనమయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

బజాజ్ ఫైనాన్స్ (1.38%), కోటక్ బ్యాంక్ (0.57%), ICICI బ్యాంక్ (0.26%), భారతి ఎయిర్ టెల్ (0.23%), HDFC బ్యాంక్ (0.19%).

టాప్ లూజర్స్:

TCS (-4.03%), నెస్లే ఇండియా (-3.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.15%), విప్రో (-3.05%), HCL టెక్నాలజీస్ (-2.62%).

Also Read: Today 18 March 2024 Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు