Home   »  వ్యాపారం   »   Today 20 Feb 2024 Stock Market | 73 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్

Today 20 Feb 2024 Stock Market | 73 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్

schedule ranjith

Today 20 Feb 2024 Stock Market | ఈ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి.

Today 20 Feb 2024 Stock Market | Sensex crossed the 73 thousand mark

Today 20 Feb 2024 Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠ స్థాయులను తాకాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 73,130.69 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 73,057 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 22,197 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.96గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.16%), HDFC బ్యాంక్ (2.59%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), NTPC (2.01%), కొటక్ బ్యాంక్ (1.83%).

టాప్ లూజర్స్ (Today 20 Feb 2024 Stock Market)

TCS (-1.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.03%), JS W Steele (-0.96%), ఇన్ఫోసిస్ (-0.90%), HCL టెక్నాలజీస్ (-0.86%).

Also Read | త్వరలో భారతదేశంలో విడుదల కానున్న Xiaomi 14.!