Home   »  వ్యాపారం   »   Today 28 March 2024 Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Today 28 March 2024 Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

schedule ranjith
Today 28 March 2024 Stock Markets | Stock markets ended in huge gains

Today 28 March 2024 Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు బ్యాంకింగ్, IT రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్లు లాభపడి 73,651కి ఎగబాకింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22,326 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.40గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్

బజాజ్ ఫిన్ సర్వ్ (3.91%), బజాజ్ ఫైనాన్స్ (3.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.53%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.26%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.21%).

Today 28 March 2024 Stock Markets | టాప్ లూజర్స్

యాక్సిస్ బ్యాంక్ (-0.50%), రిలయన్స్ (-0.37%), HCL టెక్నాలజీస్ (-0.26%), టెక్ మహీంద్రా (-0.26%).

Also Read | Today 27 March 2024 Stock Markets | నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!