Home   »  చదువు   »   సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

schedule sirisha

దేశంలోని సైనిక్‌ స్కూళ్ల (Sainik schools) లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) AISSEE పరీక్ష తేదీని పొడిగించింది. జనవరి 21న నిర్వహించాల్సిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2024)ను జనవరి 28, 2024న నిర్వహించనున్నారు.

application deadline for admissions in Sainik schools has been extended

సైనిక్‌ స్కూళ్ల (Sainik schools) లో ప్రవేశాలకు గడువు పెంపు

కొన్ని ప్రధాన జాతీయ పరీక్షల మధ్య ఘర్షణ కారణంగా పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేసారు. “కొన్ని ప్రధాన జాతీయ పరీక్షలు మరియు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2024) ఒకే రోజు నిర్వహించబడుతున్న కారణంగా AISSEE 21 జనవరి 2024న జరగడం లేదు. ఎందుకంటే ఎదురయ్యే ఇబ్బందులు కారణంగా AISSEE-2024ని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించాం. 28.01.2024 (ఆదివారం) దేశవ్యాప్తంగా” పరీక్షని నిర్వహిస్తాం అని అధికారిక ఉత్తర్వులలో పేర్కొన్నారు.

AISSEE 2024 రిజిస్ట్రేషన్ గడువు తేదీలు కూడా పొడిగించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 16 కాగా ఇది డిసెంబర్ 20, 2023 వరకు పొడిగించారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ కూడా డిసెంబర్ 20, 2023 వరకు పొడిగించారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయసు 10-12 ఏళ్లు, 9వ తరగతిలో ప్రవేశాలకు 13-15 ఏళ్ల మధ్య ఉండాలి.

అధికారిక షెడ్యూల్ ప్రకారం, దిద్దుబాటు విండో డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 24, 2023 వరకు అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ పరీక్ష దరఖాస్తు ఫారమ్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించిన ఏవైనా వివరాలలో దిద్దుబాటు ఉంటె విండో ద్వారా ఆ సమయంలో దిద్దుబాట్లు చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేయడంలో లోపం ఉన్నట్లయితే వారు ఇప్పటికే అప్‌లోడ్ చేసిన పత్రాలను సరైన పత్రాలతో భర్తీ చేసుకోవాలి.

Also read: ICAI CA ఫౌండేషన్ పరీక్ష అడ్మిట్ కార్డ్ 2023 విడుదల