Home   »  చదువు   »   నేడు పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల..!

నేడు పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల..!

schedule raju

AP SSC Hall Tickets 2024 | బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నేడు 10వ తరగతి పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసింది. పరీక్షల ప్రారంభానికి వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల చేయడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయవచ్చని తెలిపింది.

AP SSC Hall Ticket 2024 released today

AP SSC Hall Tickets 2024 | ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) AP SSC పరీక్షల 2024 షెడ్యూల్‌లో భాగంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. స్కూళ్లతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు పొందేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది. జిల్లా, స్కూలు పేరు, విద్యార్ధి పేరు, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ పొందవచ్చు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక BSEAP వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP SSC Hall Tickets 2024: పరీక్ష షెడ్యూల్

పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైనందున, విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు తగిన సమయాన్ని కేటాయించి, టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షకు పూర్తిగా సిద్ధం కావాలని సంబంధిత అధికారులు సూచించారు.

పరీక్ష పేరుపరీక్ష రోజుసబ్జెక్టు పేరు
18 మార్చి 2024సోమవారంఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -I
19 మార్చి 2024మంగళవారంద్వితీయ భాష
20 మార్చి 2024బుధవారంఇంగ్లీష్
22 మార్చి 2024శుక్రవారంగణితం
23 మార్చి 2024శనివారంభౌతిక శాస్త్రం
26 మార్చి 2024మంగళవారంజీవ శాస్త్రం
27 మార్చి 2024బుధవారంసోషల్ స్టడీస్
28 మార్చి 2024గురువారంఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్స్) & OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్, పర్షియన్) 
30 మార్చి 2024శనివారంOSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం, అరబిక్, పర్షియన్) & SSC వొకేషనల్ కోర్సు (థియరీ)  

ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం12:45 వరకు కొనసాగనున్నాయి.

అధికారిక వెబ్ సైట్:- www.bse.ap.gov.in/apsscht24/

Also Read: తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు.!