APPSC Group 1 Prelims Answer Key | ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని APPSC విడుదల చేసింది. APPSC అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లో ఈ ఆన్సర్ ‘కీ’ని అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ (APPSC Group 1 Prelims Answer Key)పై మార్చి 19 నుంచి మార్చి 21వ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అభ్యంతరాలను ఆన్లైన్ విధానం ద్వారా నిర్ణీత పద్ధతిలో నమోదు చేయాలని సూచించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది.
కాగా, మార్చి 17న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,26,068 మందికి హాల్ టికెట్లు లభించాయి. వీరిలో 91 వేల మందే పరీక్ష రాశారు. అంటే 72.55 శాతం మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉన్న 301 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
ALSO READ: AP లో SSC పరీక్షకు తొలి రోజు 96.35 శాతం మంది విద్యార్థులు హాజరు