Home   »  చదువు   »   తెలంగాణ: 6,223 B.Ed సీట్ల కేటాయింపు

తెలంగాణ: 6,223 B.Ed సీట్ల కేటాయింపు

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సు కోసం రెండవ మరియు చివరి దశ సీట్ల కేటాయింపును ఆదివారం విడుదల చేసింది. సుమారు 6,223 మంది విద్యార్థులకు B.Ed seats కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

B.Ed seats కేటాయింపు వివరాలు

బీఈడీ కోర్సు లో చివరి దశకు సంబంధించి కన్వీనర్ కోటా కింద మొత్తం 9,593 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. చివరి, రెండో దశ కౌన్సెలింగ్‌లో 6,223 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, వెబ్ ఆప్షన్లు వినియోగించుకున్న అభ్యర్థుల సంఖ్య 8,338. విద్యార్థులు ట్యూషన్ ఫీజులు(ఒకవేళ వర్తిస్తే) క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్, NEFT ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

B.Ed విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత అక్టోబర్ 30 నుండి నవంబర్ 4 మధ్య ట్యూషన్ ఫీజు రసీదు మరియు జాయినింగ్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌ల విజయవంతమైన వెరిఫికేషన్ తర్వాత, కాలేజీలో అలాట్‌మెంట్ ఆర్డర్ రూపొందించబడుతుంది.