Home   »  చదువు   »   కోటాలో 373 మంది డిప్రెషన్ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌

కోటాలో 373 మంది డిప్రెషన్ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌

schedule sirisha

Kota students | కోచింగ్ సెంటర్లలో చదువుతున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మరియు NEET ఔత్సాహికుల ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 29 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Kota students

కోటా: Kota students | కోచింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ సెప్టెంబర్‌లో ప్రారంభించిన రెండు నెలల్లో 373 ఫిర్యాదులు అందాయని, డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక్కడ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మరియు NEET ఔత్సాహికుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో కోటా లో పరిశోధనలు జరిపి అందుకు తగినట్టుగా సెప్టెంబరులో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Kota students | డిప్రెషన్ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌

ఒత్తిడి లేని వాతావరణాన్ని నిర్మించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్‌లలోని విద్యార్థులకు సుమారు ఒక నెలపాటు సాధారణ పరీక్షల నుండి మినహాయింపును ఇచ్చారు. ప్రఖ్యాత ప్రేరణాత్మక వక్తలు విద్యార్థులతో సెషన్‌లు నిర్వహించారు. దాని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మెరుగు పడే విధంగా ప్రయత్నాలను చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

JEE మరియు NEET అభ్యర్థులతో ఆందోళన కేసులను గుర్తించేటప్పుడు అనధికారిక మార్గాల్లో స్టూడెంట్ పరిస్థితులను నిరంతరం అన్వేషిస్తూ మానసికంగా క్రుగిపోయే వారిని గుర్తించి వారి పరిస్థితి మెరుగు ప్రచడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని అధికారులు తెలిపారు.

2 నెలల్లో 373 ఫిర్యాదులు అందుకున్న అధికారులు

సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వచ్చిన మొత్తం 373 ఫిర్యాదుల్లో 35 ఒత్తిడి, డిప్రెషన్‌కు సంబంధించినవేనని, వీటిని ప్రొఫెషనల్ కౌన్సెలర్లు పరిష్కరించారని ఏఎస్పీ చంద్రశీల్ ఠాకూర్ వెల్లడించారు.

ఇతర ఫిర్యాదులు ఎక్కువగా ఫీజు రీఫండ్, హాస్టల్ మెస్‌లో నాణ్యత లేని ఆహారం, సోషల్ మీడియా పోస్ట్‌లు మరియు అవాంఛిత కాల్‌లకు సంబంధించినవి అని విద్యార్థుల హెల్ప్ డెస్క్ ఇన్‌ఛార్జ్ ఠాకూర్ వెల్లడించారు. కోచింగ్ హబ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 29 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.

కోటలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇకపై జరగవు

సెప్టెంబరు 18న, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల అభ్యర్థి నీట్‌ పరీక్ష కోసం కోటాకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్న సమయంలో మానసిక ఆందోళనకు గురై విషం తాగి మృతి చెందింది. 3 రోజుల వ్యవధిలో ఇద్దరు కోచింగ్ విద్యార్థులు, NEET ఔత్సాహికులు వేర్వేరు హాస్టళ్లలో తమ తమ గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో నవంబర్ చివరిలో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తెలిపారు. దీనితో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 29 కి చేరుకుంది.

కాగా కోచింగ్ విద్యార్థుల మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సెప్టెంబర్ 10 న న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభించారు. అయితే సాధారణ రోగులు కూడా ఇక్కడ చికిత్స పొందే అవకాశాన్ని కూడా కల్పించారు.

ఇప్పటివరకు 400 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌

“కేంద్రం దాదాపు 400 మంది రోగులకు సైకలాజికల్ కౌన్సెలింగ్‌ను ఇచ్చి వారు మానసిక ధైర్యాన్ని పెంచారు. ఇంకా వారిలో ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు” అని సెంటర్ ఇన్‌ఛార్జ్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోట అదనపు ప్రిన్సిపాల్ డాక్టర్ బి ఎస్ షెకావత్ వెల్లడించారు.

“మానసిక ఆరోగ్య సమస్యలతో కనీసం 35 మంది విద్యార్థులను జిల్లా యంత్రాంగం సూచించింది. వారికి ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ మరియు అవసరమైతే అదనపు చికిత్స అందిస్తామని అన్నారు. ఈ విద్యార్థులు కోపింగ్ స్ట్రాటజీలను అభివృద్ధి చేయడంలో సహాయపడే ఫాలో-అప్ సపోర్ట్ సిస్టమ్ కూడా జరుగుతోంది. ” అని అన్నారు.

Also read: దేశంలో 70 శాతం పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు..