Home   »  చదువు   »   CUET PG 2024 | CUET PG ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

CUET PG 2024 | CUET PG ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

schedule sirisha

CUET PG 2024: కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించబడింది. అభ్యర్థులు జనవరి 31 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

CUET PG 2024 | CUET PG Entrance Test Application Deadline Extension

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ PG (CUET PG) దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgcuet.samarth.ac.in ద్వారా 31 జనవరి 11:50 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు జనవరి 24 వరకు మాత్రమే ఉండేది.

CUET PG 2024 | మార్చి 11 నుంచి పరీక్షల ప్రారంభం

CUET PG 2024 మార్చి 11 నుండి 28 వరకు నిర్వహించబడుతుంది. ఆన్సర్ కీ ఏప్రిల్ 4న విడుదల చేయబడుతుంది. CUTE PG పరీక్ష వ్యవధి 1 గంట 45 నిమిషాలు. మూడు షిఫ్టులు ఉంటాయని, పేపర్ టైమింగ్స్ త్వరలో అభ్యర్థులకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. CUTE PG 2024 పరీక్ష స్థాన సమాచార స్లిప్‌లు మార్చి 4న జారీ చేయబడతాయని, మార్చి 7న అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారని తెలిపారు.

Also read: అయోధ్య కోసం స్కూల్‌కు సెలువు.. రిపోర్టు ఇవ్వాలంటూ మండిపడ్డ మంత్రి