Home   »  చదువు   »   Distance Education |అంబేద్కర్ యూనివర్శిటీ అడ్మిషన్స్ రేపే లాస్ట్

Distance Education |అంబేద్కర్ యూనివర్శిటీ అడ్మిషన్స్ రేపే లాస్ట్

schedule sirisha

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, దూరవిద్య (Distance Education) ద్వారా చదవాలనుకునే వారి కోసం డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది.

2023-2024 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వెల్లడిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హత అవసరాలు, దరఖాస్తు వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు మొదట జూలై 31 చివరి తేదీగా నిర్ణయించగా, దానిని మరో రెండు వారాలు పొడిగించినట్లు ప్రకటించారు.

అంటే అడ్మిషన్ దరఖాస్తులకు ఆగస్టు 16 చివరి తేదీ కాగా ఈ తేదీని కూడా పొడిగించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 05, 2023. అక్టోబర్ 05, 2023 వరకు ఆలస్య రుసుముతో రూ. 200 నుండి 500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంబీఏ కోర్సుల్లో పీజీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, బీఏ, పీజీలో బీకామ్, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమాలో ఎంఎల్ఐఎస్సీ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

Distance Education | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జూన్ 14 నుండి ప్రారంభమై అక్టోబర్ 5న ముగియనుంది. https://www.braouonline.in/website లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

BA, BCom, BSc – తెలుగు, ఇంగ్లీష్ మీడియం, BA, BSc – ఉర్దూ మాధ్యమంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. PG కోర్సులకు MA/MSc/M.Com, గ్రాడ్యుయేషన్ పాస్ అర్హతగా పరిగణించ బడుతుంది.

మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నంబర్‌లకు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Also read : BSC నర్సింగ్ రిజిస్ట్రేషన్ కు మరో 5 రోజుల గడువు