Home   »  చదువు   »   APలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం..

APలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం..

schedule mounika
Half Day Schools

Half Day Schools | ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభిస్తుంటే, ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న బడుల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపాలని కమిషనర్‌ ఆదేశించారు.

ALSO READ: నేడు గేట్‌ 2024 ఫలితాల విడుదల