Home   »  చదువు   »   JEE మెయిన్‌ ఫైనల్‌ కీ విడుదల..!

JEE మెయిన్‌ ఫైనల్‌ కీ విడుదల..!

schedule raju

JEE Main 2024 final answer key | దేశంలోని విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్ష ఫైనల్‌ కీ విడుదలైంది. JEE మెయిన్ 2024 మొదటి సెషన్ జనవరి 24, 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించబడింది.

JEE Main 2024 final answer key Released

JEE Main 2024 final answer key | దేశంలోని విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్ష ఫైనల్‌ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో “కీ” చూసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 12,95,617 మంది రిజిస్టేషన్‌ చేసుకోగా 12,25,529 మంది హాజరయ్యారు.

JEE మెయిన్ 2024 మొదటి సెషన్

JEE మెయిన్ 2024 మొదటి సెషన్ జనవరి 24, 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించబడింది. మొదటి రోజు BArch మరియు BPlanning (పేపర్ 2) పరీక్ష నిర్వహించగా, మిగిలిన అన్ని రోజులలో BE/BTech (పేపర్ 1) పరీక్ష జరిగింది.

JEE మెయిన్ 2024 యొక్క ఆల్ ఇండియా ర్యాంక్‌లు సెషన్ 2 పరీక్ష తర్వాత తుది ఫలితాల సమయంలో ప్రకటించబడతాయి. గతసారి ప్రవేశ పరీక్షలో 43 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంక్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కాళ్లకూరి సాయినాధ్ శ్రీమంత్, రాజస్థాన్‌కు చెందిన ఇషాన్ ఖండేల్‌వాల్‌లు వరుసగా 2, 3 ర్యాంకులు సాధించారు.

JEE మెయిన్స్ సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 6న విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్సర్ కీపై అభ్యంతరాలు (ఏదైనా ఉంటే) తెలపడానికి ఫిబ్రవరి 9 వరకు అవకాశం ఇవ్వబడింది. చెల్లుబాటు అయ్యే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది సమాధాన కీని సిద్ధం చేశారు. ఈ ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తారు.

JEE Main 2024 final answer key ఎలా డౌన్లోడ్ చేయాలి?

  • jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • హోమ్‌పేజీలో, JEE (మెయిన్) 2024 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి
  • ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది
  • జవాబులను కీని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేయండి

Also Read: JEE మెయిన్‌-1 ఆన్సర్‌ కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ