Home   »  చదువు   »   జాతీయ ఫెలోషిప్ పథకం ద్వారా 1070 మంది OBC విద్యార్థులకు లబ్ధి

జాతీయ ఫెలోషిప్ పథకం ద్వారా 1070 మంది OBC విద్యార్థులకు లబ్ధి

schedule sirisha

National Fellowship Scheme | జాతీయ ఫెలోషిప్ పథకం కింద 1070 మంది OBC విద్యార్థులు లబ్ది పొందారు. రాజ్యసభలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 324 మంది విద్యార్థులు లబ్ధి పొందగా, 2019-20లో 810 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇంకా ఈ సంఖ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 722కు పెరిగింది. 2021-22లో 831మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

1070 OBC students benefited through National Fellowship Scheme

National Fellowship Scheme | 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం యొక్క జాతీయ ఫెలోషిప్ పథకం కింద వెనుకబడిన తరగతి (OBC) విద్యార్థులు మొత్తం 1070 మంది ప్రయోజనం పొందారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక లబ్ధిదారుల సంఖ్య అని వెల్లడించారు. ఈ డేటాను ఈ రోజు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భూమిక్ లిఖితపూర్వక సమాధానంలో ప్రకటించారు.

జాతీయ ఫెలోషిప్ పథకం యొక్క 5 సంవత్సరాల వివరాలు

జాతీయ ఫెలోషిప్ పథకం యొక్క 5 సంవత్సరాలు పూర్తి వివరాలను లిఖిత పూర్వకంగా రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 324 మంది విద్యార్థులు లబ్ది పొందగా, 2019-20లో 810 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇంకా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 722కు చేరింది. 2021-22లో 831మంది, 2022-2023లో 1070 మందికి లాభం చేకురింది.

నాణ్యమైన ఉన్నత విద్యను పొందడంలో ఫెలోషిప్ (ఆర్థిక సహాయం) అందిస్తుంది. OBC విద్యార్థుల కోసం ప్రభుత్వ జాతీయ ఫెలోషిప్ పథకం యొక్క లక్ష్యం వారి విద్యా సాధికారత అని మంత్రి తెలియజేశారు.

కింది పరీక్షల్లో అర్హత సాధించిన MPhil, Ph.D అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలను చేపట్టేందుకు సంవత్సరానికి మొత్తం 1000 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లను అందించడానికి ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు.

  1. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ – UGC (హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోసం) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (NET-JRF)
  2. UGC – కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (UGC-CSIR) NET-JRF జాయింట్ టెస్ట్ (సైన్సెస్ కోసం)

National Fellowship Scheme వివరాలు

  • JRF (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్):- 2 సంవత్సరాలకు రూ. 31,000 నుండి రూ. 37,000 వరకు అందిస్తారు.
  • SRF కోసం (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్):- మిగిలిన సంవత్సరాలకు రూ. 35,000 నుండి రూ. 42,000 వరకు అందిస్తారు.

Also read: AIIMS INI CET 2023 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల