Home   »  చదువు   »   AYUSH NEET 2వ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాల విడుదల

AYUSH NEET 2వ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాల విడుదల

schedule sirisha

ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) NEET UG రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం సీట్ల కేటాయింపు ఫలితాలను ఈ రోజు (సెప్టెంబర్ 27)న విడుదల చేస్తుంది. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాలని చూసుకోవాలని తెలిపారు.

AYUSH NEET లో కోర్సులు

BAMS, BSMS, BUMS, BHMS కోర్సులో ఆల్ ఇండియా పరిధిలోని వాటి ఫలితాలను ఈ రోజు విడుదల చెయన్నట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5, 2023 మధ్య అడ్మిషన్ కోసం కేటాయించిన సంస్థలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మూడో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు

అక్టోబరు 12 నుంచి 15 వరకు మూడో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు జరగనున్నట్లు వెల్లడించారు. సీట్ల కేటాయింపు ఫలితాలను అక్టోబర్ 18న వెల్లడిస్తామని తెలిపారు.

అభ్యర్థులు ఫలితాలని ఈ విధంగా తెలుసుకోవచ్చు

  • aaccc.gov.in కి వెళ్లండి.
  • UG కౌన్సెలింగ్ కింద, రౌండ్ 2 కేటాయింపు ఫలితాల లింక్‌ పై క్లిక్ చేయాలి.
  • అవసరమైతే మీ ఆధారాలతో లాగిన్ చేయవచ్చు.
  • ఫలితాన్ని చూసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • మీ కేటాయింపు లేఖ యొక్క ప్రింటవుట్ తీసుకోవచ్చు.

Also read : TS ICET 2023 సీట్ల కేటాయింపు