Home   »  చదువు   »   తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు.!

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు.!

schedule raju
TS Model School Admission Deadline Extension

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్‌లో VII నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల అడ్మిషన్ల (TS Model School Admission) కోసం ఫీజు చెల్లింపు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 2 వరకు పొడగించారు. అంతకుముందు ఫిబ్రవరి 23 చివరి తేదీగా చివరి తేదీని నిర్ణయించారు. విద్యాశాఖకు ఇప్పటివరకు 47,768 దరఖాస్తులు వచ్చాయి.

రాష్ట్రంలోని ఒక్కో మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలో 100 సీట్లు ఉన్నాయి. ప్రతి తరగతిలో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల ఆధారంగా VII నుండి X తరగతి వరకు ప్రవేశాలు జరుగుతాయి. దరఖాస్తు రుసుము రూ.200 (SC, ST, BC, PH మరియు EWS వర్గాలకు రూ.150)గా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం, https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read: GATE 2024 Response షీట్ విడుదల..!